తెలుగు మానిఫెస్టో

తెలుగువారు తమ రోజువారీ వ్యవహారాలను తెలుగులో జరుపుకోగలగాలి!

ప్రభుత్వం - శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు

ప్రజల తర్వాత వారిపై అత్యంత ప్రభావాన్ని చూపించే వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలు తెలుగు భాషలో నడుస్తూ, వాటి విధానాలు తెలుగు భాషకు అనుగుణంగా ఉన్నప్పుడు మన లక్ష్యం నెరవేరినట్టే.

ముద్రణ, ప్రసార, జాల మాధ్యమాలు

ప్రజల మధ్య, సమాజంలోని తతిమా వ్యవస్థల మధ్య అంతరాల్ని పూడ్చి సంభాషణా వారధులుగా వ్యవహరించేవే మాధ్యమాలు. వీటికి ఉన్న ప్రాధాన్యత లేదా అవి పోషించే పాత్ర మూలంగా వీటిని ఫోర్త్ ఎస్టేట్‌గా వ్యవహరించారు. తెలుగు భాషకు ఆధునికహోదాలో కూడా వీటిదే కీలక పాత్ర.

వ్యాపార సంస్థలు

నేటి మార్కెట్-ఆధారిత పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపార సంస్థల పాత్ర కూడా అంచనాలకు మించిన ప్రాధాన్యం కలది. వాటినుండి భాషకు తగ్గ తోడ్పాటు లభించినప్పుడే ఆధునికహోదా లభించినట్టు.